బండి సంజయ్ తెచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా.?
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తేవలేదన్న మాజీ మేయర్, బీఆర్ఎస్ నేత రవీందర్ సింగ్ వ్యాఖ్యలు రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు మండిపడ్డారు.

బండి సంజయ్ తెచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా.?
కరీంనగర్ బ్యూరో , మనసాక్షి :
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తేవలేదన్న మాజీ మేయర్, బీఆర్ఎస్ నేత రవీందర్ సింగ్ వ్యాఖ్యలు రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు మండిపడ్డారు. సోమవారం పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రవీందర్ సింగ్ విసిరిన సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామని, బండి సంజయ్ కృషితో కరీంనగర్‌కు వేల కోట్ల రూపాయల కేంద్ర నిధులు వచ్చాయని లెక్కలతో సహా నిరూపిస్తామని స్పష్టం చేశారు.
నిధుల వివరాలు తేలిన తర్వాత రవీందర్ సింగ్ తన వ్యాఖ్యలకు కట్టుబడి రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నగరపాలక సంస్థ అభివృద్ధి చెందకపోవడంతోనే ప్రజలు ఆ పార్టీని సింగిల్ డిజిట్‌కు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. ప్రజలు బీజేపీపై ఉంచిన విశ్వాసంతోనే నగరపాలక సంస్థపై కాషాయ జెండా ఎగిరిందన్నారు.
ఈ సమావేశంలో కార్పొరేటర్లు బండారి వేణు, బండ రమణారెడ్డి, ఎన్నం లక్ష్మీప్రకాశ్, గాజ రమశివరాం, కర్రె పద్మ అనిల్, కొలిపాక శ్రీనివాస్, దేవసాని సరస్వతి సత్యనారాయణ, జాడి బాల్‌రెడ్డి, తోట అనిల్, వంగల రవిగోపాల్, కేఏపీపీ చంద్ర, అప్పాల శ్రీనివాస్, దయ్యాల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.









