Breaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు
మిర్యాలగూడలో ఘనంగా శ్రావణమాసం బోనాలు..!
శ్రావణమాసం బోనాల పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని కల్లాలవాడలో గల ప్రసిద్ధ శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవాలయం లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

మిర్యాలగూడలో ఘనంగా శ్రావణమాసం బోనాలు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
శ్రావణమాసం బోనాల పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని కల్లాలవాడలో గల ప్రసిద్ధ శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవాలయం లో
ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా మిర్యాలగూడ శాసనసభ్యులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.
కార్యక్రమంలో మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ సుధా బాలకృష్ణ అమ్మవారికి బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.. శ్రావణమాస బోనాల సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడగా, అమ్మవారి ఆశీస్సులు మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు.
ALSO READ : పేకాట స్థావరాలపై దాడి.. ఆరుగురు అరెస్ట్









