Nalgonda : టిఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులుగా విక్రాంత్ రెడ్డి..!
తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) నల్గొండ జిల్లా అధ్యక్షులుగా వడిగపాటి విక్రాంతి రెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత ఉత్తర్వులు జారీ చేశారు.

Nalgonda : టిఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులుగా విక్రాంత్ రెడ్డి..!
మన సాక్షి, నల్గొండ :
తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) నల్గొండ జిల్లా అధ్యక్షులుగా వడిగపాటి విక్రాంతి రెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు విక్రాంత్ రెడ్డికి ఆదివారం ఆమె ఉత్తర్వులను అందజేశారు. తెలంగాణలో పార్టీ బలోపేతం చేసేందుకు అన్ని జిల్లాల అధ్యక్షులు నియామకంలో భాగంగా నల్గొండ జిల్లాలో విక్రాంత్ రెడ్డిని నియమించారు.
Also Read : TRS : టిఆర్ఎస్ జిల్లాల అధ్యక్షుల నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన కవిత..!
నూతనంగా జిల్లా అధ్యక్షులుగా నియామకమైన విక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో టిఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. పార్టీ అధినేత్రి కవిత తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకులు కార్యకర్తలు సహకరించాలని కోరారు.









