TRS : టిఆర్ఎస్ జిల్లాల అధ్యక్షుల నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన కవిత..!
తెలంగాణ రక్షణ సేన (టి ఆర్ ఎస్) బలోపేతానికి చర్యలు చేపట్టారు. తెలంగాణ లోని పలు జిల్లాల అధ్యక్షులను నియమిస్తూ ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

TRS : టిఆర్ఎస్ జిల్లాల అధ్యక్షుల నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన కవిత..!
మన సాక్షి, హైదరాబాద్ :
తెలంగాణ రక్షణ సేన (టి ఆర్ ఎస్) బలోపేతానికి చర్యలు చేపట్టారు. తెలంగాణ లోని పలు జిల్లాల అధ్యక్షులను నియమిస్తూ ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నల్గొండ జిల్లా అధ్యక్షులుగా పడిగపాటి విక్రాంత్ రెడ్డి, నారాయణపేట జిల్లా అధ్యక్షులుగా గవినోళ్ల శ్రీనివాస్, జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులుగా ఆవుల బుచ్చిబాబు యాదవ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులుగా కుశన్న నరేష్ నేత, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులుగా గండసిరి వేణు, కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా శ్రీనివాస్ గౌడ్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా సిరివెని స్వప్న, ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా షేక్ హుస్సేన్ నియమిస్తూ ఉత్తరాలు జారీ చేశారు. అదేవిధంగా హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మాడుగుల రాజిరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బండారి సుమన్, నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా లకుమారపు మల్లయ్య ను నియమించారు.









