Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునిజామాబాద్పండుగలు

ఆలూర్ లో ఘనంగా దసరా సంబరాలు.. రావణ దహనం..!

నిజామాబాదు జిల్లా ఆలూర్ మండల కేంద్రంలో దసరా వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అలాగే రావణ కాష్టమి దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రావణ దహనం చూడడానికి గ్రామ ప్రజలు భారీగా తరలివచ్చారు.

ఆలూర్ లో ఘనంగా దసరా సంబరాలు.. రావణ దహనం..!

ఆర్మూర్, మన సాక్షి

నిజామాబాదు జిల్లా ఆలూర్ మండల కేంద్రంలో దసరా వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అలాగే రావణ కాష్టమి దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రావణ దహనం చూడడానికి గ్రామ ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించిన ఈ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి.

ఉత్సవాల్లో భాగంగా ముందుగా శ్రీరామచంద్రుని చిత్రపటాన్ని డప్పు చప్పుళ్లు,మంగళవాయిద్యాలతో ప్రధాన వీధుల వాగు గడ్డ హనుమాన్ మందిరం వరకు ఘనంగా ఊరేగించారు.

అనంతరం ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా జమ్మి పూజ నిర్వహించారు.పూజా కార్యక్రమాల అనంతరం రావణ దహన కార్యక్రమాన్ని కనులవిందుగా చేపట్టారు. రావణుని దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా ప్రజలు హర్షధ్వానాలు చేశారు.సమాజంలో అహంకారాన్ని, చెడును రూపుమాపి ధర్మాన్ని కాపాడటమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు కళ్లెం మోహన్, ఉత్సవ కమిటీ సభ్యులు గండ్ల రామచందర్, గ్రామ సర్పంచ్ విజయ్,డాక్టర్ అరుణ్, మూలాకిడి శ్రీనివాస్, కళ్లెం బోజరెడ్డి, వీడీసీ క్యాషియర్ దుగ్గి లక్ష్మణ్, మిద్దెల రాజు, చిలుక శ్రీను, సభ్యులు మాట్లాడుతూ ప్రజల ఐక్యతతోనే పండుగలను ఇంత ఘనంగా నిర్వహించుకోవడం సాధ్యమైందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు