Miryalaguda : మిర్యాలగూడలో ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభం..!
మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు ప్రాంతంలో దీప్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి సతీమణి బత్తుల మాధవి సోమవారం ప్రారంభించారు.

Miryalaguda : మిర్యాలగూడలో ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు ప్రాంతంలో దీప్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి సతీమణి బత్తుల మాధవి సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా బత్తుల మాధవి మాట్లాడుతూ, మహిళలు విద్య, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి రంగాల్లో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కుట్టుమిషన్ శిక్షణ ద్వారా మహిళలు ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
మహిళలు తమలోని నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని కుటుంబ ఆర్థికాభివృద్ధికి తోడ్పడటంతో పాటు, సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్ శిక్షణ అందించేందుకు ముందుకొచ్చిన దీప్తి ఫౌండేషన్ నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందించారు.
మహిళల సాధికారత, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధిని ప్రోత్సహించే ఇలాంటి కార్యక్రమాలు మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.









