Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు

Miryalaguda : ఘనంగా విజయదశమి వేడుకలు.. పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి..!

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం మిర్యాలగూడ మండలంలోని రుద్రారం, తకెళ్లపాడు గ్రామాలతో పాటు వేములపల్లి మండలంలోని రావులపెంట గ్రామంలో ఘనంగా విజయదశమి వేడుకలు నిర్వహించడం జరిగింది.

Miryalaguda : ఘనంగా విజయదశమి వేడుకలు.. పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం మిర్యాలగూడ మండలంలోని రుద్రారం, తకెళ్లపాడు గ్రామాలతో పాటు వేములపల్లి మండలంలోని రావులపెంట గ్రామంలో ఘనంగా విజయదశమి వేడుకలు నిర్వహించడం జరిగింది. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ప్రజలందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

విజయదశమి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సమృద్ధిని తీసుకురావాలని, ప్రజలందరూ ఐకమత్యంతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో మిర్యాలగూడ మండలం పార్టీ అధ్యక్షులు గుండు నరేందర్ గౌడ్, దొంతిరెడ్డి వెంకటరెడ్డి గ్రామస్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు