సూర్యాపేట జిల్లాలో వ్యక్తి హత్య..!
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం కరివిరాల గ్రామంలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన కంచం వెంకన్న (30) ను వ్యక్తులు హత్య చేశారు.

సూర్యాపేట జిల్లాలో వ్యక్తి హత్య..!
(మన సాక్షి, తుంగతుర్తి – సుభాష్ )
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం కరివిరాల గ్రామంలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన కంచం వెంకన్న (30) ను వ్యక్తులు హత్య చేశారు. కు గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడెం గ్రామం నుంచి వెంకన్న బిఆర్ఎస్ వార్డు సభ్యునిగా గెలిచారు. హత్య రాత్రి జరిగిందా..? లేక ఉదయం జరిగిందా..? అనేది నిర్ధారణ కావలసి ఉంది.
Also Read : Nalgonda : ఎస్ బి ఐ లో ఆ ప్యాకేజ్ కలిగి ఉంటే ప్రమాదంలో మరణిస్తే కోటి రూపాయల భీమా..!
ఆదివారం ఉదయం కొంతమంది తమ వాహనాల్లో డీజిల్, పెట్రోల్ కావాలని తలుపులు తట్టినప్పటికీ లేవకపోవడంతో తండ్రి కంచం రాములు దుకాణం తలుపులు కొట్టినప్పటికీ స్పందన లేదు. వెనుక కిటికీలో నుంచి చూడగా కొడుకు వెంకన్న నిర్జీవంగా పడి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడు వెంకన్నకు టోల్గేట్ వద్ద చిరు వ్యాపారం ఉంది. మృతుని భార్య బతుకమ్మ పండుగకు తన తల్లి గారు స్వగ్రామం వెళ్లారు. ఇద్దరు సంతానం ఉన్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.









