Miryalaguda : కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ వర్ధంతి..!
మిర్యాలగూడ మండలం యాదగిరిపల్లి గ్రామంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, ఎం సి పి ఐ (యు) వ్యవస్థాపక నేత, కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ 18వ వర్ధంతి సభ శనివారం నిర్వహించడం జరిగింది.

Miryalaguda : కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ వర్ధంతి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ మండలం యాదగిరిపల్లి గ్రామంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, ఎం సి పి ఐ (యు) వ్యవస్థాపక నేత, కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ 18వ వర్ధంతి సభ శనివారం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎంసీపీఐయు కేంద్ర కమిటీ సభ్యులు వస్కుల మట్టయ్య, ఎం సి పి ఐ యు జిల్లా కార్యదర్శి సైదమ్మ మాట్లాడుతూ, భూమి కోసం భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం, వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 12 సంవత్సరాల వయసులోనే పాల్గొని నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, దేశముఖ్ గుండాలకు వ్యతిరేకంగా, తుపాకి చేతబట్టి ఎర్ర జెండా పట్టుకొని పోరాటం చేసిన విప్లవ నాయకుడు ఎర్రజెండా ముద్దుబిడ్డ కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ అని అన్నారు.
Also Read : ఆంధ్రప్రదేశ్ లోని పెనుగొండలో తీవ్ర విషాదం.. రిజర్వాయర్ లో పడి ఐదుగురు బాలికలు మృతి.!
వీర తెలంగాణ సాయుధ పోరాటంలో 10 లక్షల ఎకరాలను పేద ప్రజలకు పంచి, మూడువేల గ్రామాలలో గ్రామ రాజ్యాలు ఏర్పాటు చేసి,పేదలకు అండగా నిలబడిన గొప్ప నాయకుడు కామ్రేడ్ ఓంకార్, ఆయన ఆశయం ఈ దేశంలో పేద వాళ్లకు రైతులకు, కార్మికులకు, కష్టజీవులకు, మూడు పూటలా భోజనం దొరికే వ్యవస్థ రావాలని, కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో, ఈ దేశంలో సోషలిస్టు పార్టీ వ్యవస్థ ఏర్పడాలని అన్నారు.
ఆయన ఆశయ సాధన కోసం వీర తెలంగాణలో ఉన్న ప్రజలందరూ ఒక వేదిక మీదికి వచ్చి, బహుజనుల రాజ్యాధికారం రావాలని, తెలంగాణలో ప్రజారాజ్యం ఏర్పడాలని, వామపక్ష పార్టీలన్నీ, ఒకేవేదిక మీదకు వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జన గణనలో బీసీ కులగణన కాలం చేర్చాలని ఎస్సీ ఎస్టీ, బీసీ రైతు డిక్లరేషన్ ల హామీలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణలో కులాల వారీగా జనాభా సామాజిక ఆర్థిక స్థితిగతులు విద్య ఉపాధి సంబంధించిన వివరాలను కచ్చితంగా నమోదు చేసి ప్రజల ముందు ఉంచాలని అన్నారు.
సమగ్ర కులగన ద్వారా సామాజిక న్యాయం సమాన అవకాశాలు వనరుల పంపిణీలో న్యాయం సాధించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎంసీపీఐ(యు) డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎం సి పి ఐ యు జిల్లా నాయకులు, గ్రామ నాయకులు, భరత్, విశాలాంధ్ర, మౌనిక, ఝాన్సీ, కార్తీక్ సుకన్య, అన్విష తదితరులు పాల్గొన్నారు.









