Suryapet : అర్ద రాత్రి ఉలిక్కి పడిన కుటుంబం.. ఇంట్లోకి దూసుకెళ్లిన డీసీఎం..!
సూర్యాపేట పట్టణంలోని నాలుగో వార్డ్ పరిధిలో శనివారం తెల్లవారుజామున ఓ డీసీఎం వాహనం అదుపుతప్పి ఇంట్లోకి తీసుకెళ్లింది.

Suryapet : అర్ద రాత్రి ఉలిక్కి పడిన కుటుంబం.. ఇంట్లోకి దూసుకెళ్లిన డీసీఎం..!
మనసాక్షి, సూర్యాపేట :
సూర్యాపేట పట్టణంలోని నాలుగో వార్డ్ పరిధిలో శనివారం తెల్లవారుజామున ఓ డీసీఎం వాహనం అదుపుతప్పి ఇంట్లోకి తీసుకెళ్లింది. అర్ధరాత్రి అందరు పడుకున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రభయాందోళనలకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Also Read : మాడుగుల పల్లి మండలంలో అద్దంకి నార్కట్ పల్లి జాతీయ రహదారిపై లారీ బోల్తా..!
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగో వార్డు దుబ్బ తండ నుంచి పాండ్యా నాయక్ తండాకు వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
ఇంటి గోడను ఢీకొనడంతో గోడ కూలిపోయి ఇటుకలు ఇంటి లోపల పడ్డాయి. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో వాళ్ళందరూ నిదిరిస్తున్నారు. అర్ధరాత్రి వేళ ఈ సంఘటన జరగడంతో భారీ శబ్దం రావడం.. అందరూ ఒకేసారి ఉలిక్కిపడ్డారు.
– ముత్యంరాజు, సూర్యాపేట









