Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
మాడుగుల పల్లి మండలంలో అద్దంకి నార్కట్ పల్లి జాతీయ రహదారిపై లారీ బోల్తా..!
నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండలం కుక్కడం గ్రామ శివారులో అద్దంకి - నార్కట్ పల్లి జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి ఆయిల్ లోడ్ తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది.

మాడుగుల పల్లి మండలంలో అద్దంకి నార్కట్ పల్లి జాతీయ రహదారిపై లారీ బోల్తా..!
మన సాక్షి, మాడుగుల పల్లి :
నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండలం కుక్కడం గ్రామ శివారులో అద్దంకి – నార్కట్ పల్లి జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి ఆయిల్ లోడ్ తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో పెను ప్రమాదం తప్పింది. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భారీ లోడుతో ఉన్న లారీ అదుపుతప్పి రోడ్డుపై పడడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న మాడుగులపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. ఆ తర్వాత టోల్గేట్ సిబ్బంది ద్వారా బోల్తా పడిన వాహనాన్ని తొలగించేందుకు చర్యలు చేపట్టారు.
– సైదులు, మాడ్గులపల్లి
Also Read : కెమికల్ కంపెనీలో భారీ పేలుడు.. ఐదుగురు కార్మికుల దుర్మరణం..!









