Breaking Newsఆంధ్రప్రదేశ్రాజకీయం
మదనపల్లె మున్సిపల్ చైర్మన్ టీడీపీ అభ్యర్థిగా శ్రీరామ్ చినబాబు ఖరారు
రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో మదనపల్లె మున్సిపల్ చైర్మన్ పీఠానికి టీడీపీ అభ్యర్థిగా యువ నాయకుడు శ్రీరామ్ చినబాబు పేరు ఖరారైంది.

మదనపల్లె మున్సిపల్ చైర్మన్ టీడీపీ అభ్యర్థిగా శ్రీరామ్ చినబాబు ఖరారు
(మదనపల్లె – రాజు):
రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో మదనపల్లె మున్సిపల్ చైర్మన్ పీఠానికి టీడీపీ అభ్యర్థిగా యువ నాయకుడు శ్రీరామ్ చినబాబు పేరు ఖరారైంది. మదనపల్లె మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా శ్రీరామ్ చినబాబును పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఆయన అభ్యర్థిత్వం ఖరారు కావడంతో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీరామ్ చినబాబు పార్టీ కోసం ఎంతో నిబద్ధతతో, విధేయతతో పనిచేస్తున్న యువ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయనను అభ్యర్థిగా ప్రకటించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టీడీపీ గెలుపు తథ్యమని, మదనపల్లె మున్సిపాలిటీని టీడీపీ జెండా ఎగరవేయడం ఖాయమని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.









