Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం
ఆంధ్రప్రదేశ్ లోని పెనుగొండలో తీవ్ర విషాదం.. రిజర్వాయర్ లో పడి ఐదుగురు బాలికలు మృతి.!
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండలో తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుంది. గొల్లపల్లి రిజర్వాయర్ లో పడి ఐదుగురు బాలికలు మృతి చెందారు.

ఆంధ్రప్రదేశ్ లోని పెనుగొండలో తీవ్ర విషాదం.. రిజర్వాయర్ లో పడి ఐదుగురు బాలికలు మృతి.!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండలో తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుంది. గొల్లపల్లి రిజర్వాయర్ లో పడి ఐదుగురు బాలికలు మృతి చెందారు. గొల్లపల్లి రిజర్వాయర్ కు స్నానం కోసం వెళ్లిన బాలికలు ఈత రాక మునిగిపోయారు. ఒకరికి ఒకరు పట్టుకుని ఊపిరాడక మృతి చెందినట్లు తెలుస్తోంది.
విషయం తెలుసుకున్న రెస్క్యూ టీం సిబ్బంది బాలికల మృతదేహాలను బయటకు తీశారు. వీరంతా పెనుగొండకు లోని దర్గాపేట కు చెందిన ముస్లిం కుటుంబాలకు చెందిన బాలికలుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : రెండేళ్ల ప్రగతి ప్రస్థానం.. పాలమూరు వీసీకి ఒప్పంద అధ్యాపక సంఘం ఘన సత్కారం









