Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వాకింగ్ చేస్తున్న ఇద్దరు మృతి..!

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాకింగ్ చేస్తున్న వ్యక్తులను డీసీఎం ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన బాల్యంలో స్టేజి సమీపంలో జరిగింది.

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వాకింగ్ చేస్తున్న ఇద్దరు మృతి..!

క్షతగాత్రులను సమీపంలోని ఏరియా హాస్పిటల్ కు తరలించిన స్థానికులు

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాకింగ్ చేస్తున్న వ్యక్తులను డీసీఎం ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన బాల్యంలో స్టేజి సమీపంలో జరిగింది. వివరాల ప్రకారం.. జనగాం వైపు నుండి సూర్యాపేట వైపు వస్తున్న డీసీఎం బాలెంల స్టేజ్ సమీపంలో జాగింగ్ చేస్తున్న గుర్రం సైదులు, ఆలకుంట్ల నాగరాజు, గొల్ల జానయ్య లను డీకొట్టింది.

ఈ ప్రమాదంలో గుర్రం సైదులు సంఘటన స్థలంలోనే మృతి చెందగా, ఆలకుంట్ల నాగరాజుకు రెండు కాళ్ళు విరిగినట్టు, గొల్ల జానయ్య తలకు బలమైన గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆలకుంట్ల నాగరాజు మృతి చెందారు.

మరిన్ని వార్తలు