Breaking News : మన సాక్షి బ్రేకింగ్ న్యూస్ 15-10-2026
మన సాక్షి ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ అందిస్తుంది. ఒకే క్లిక్ తో స్థానిక వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలు కూడా అందుబాటులో ఉన్నాయి.

Breaking News : మన సాక్షి బ్రేకింగ్ న్యూస్ 15-10-2026
మన సాక్షి, వెబ్ డెస్క్ :
మన సాక్షి ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ అందిస్తుంది. ఒకే క్లిక్ తో స్థానిక వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలు కూడా అందుబాటులో ఉన్నాయి.
హార్మోజ్ జలసందిలో మునిగిన కంటైనర్ షిప్
హార్మోజ్ జల సంధిలో కంటైనర్ షిప్ మునిగింది. నౌక సముద్రపు మైండ్స్ ను ఢీకొని మంటలు జలరేగినట్లు ఇరాన్ నేవీ ప్రకటన విడుదల చేసింది. కానీ ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు పై సందిగ్ధత కొనసాగుతుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం సముద్రంలో తేలుతున్న ఐఫోన్లు ఇతర వస్తువులు ఉన్నాయి. 2500 పైగా కంటైనర్లతో వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో మాత్రం ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి.
అమ్మవారి విగ్రహం ధ్వంసం నిందితుడికి దేహశుద్ధి
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం చీకటి బలరాంపురం గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో అపచారం జరిగింది. శ్రీ బోధమ్మ తల్లి ఆలయంలో దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేశాడు. దాంతో నిందితుడిని గ్రామస్తులు పట్టుకున్నారు దేహశుద్ధి చేశారు.
రన్నింగ్ కారులో మంటలు
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ అన్నోజిగూడ ఫ్లైఓవర్ పై రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో నలుగురు ఉండగా వారు వరంగల్ వాసులుగా గుర్తించారు. వెంటనే వారు అప్రమత్తమై కారు దిగడంతో ప్రాణాలతో బయటపడ్డారు. కారు పూర్తిగా దగ్ధమైంది.
విద్యుత్ కోతలకు నిరసనగా రైతుల రాస్తారోకో
నల్గొండ జిల్లా గుండ్లపల్లి మండలం సింగరాజు పల్లి సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతులు రాస్తారోకో చేశారు. సబ్ స్టేషన్ ముట్టడించారు. దాంతో పాటు నల్లగొండ – దేవరకొండ రహదారిపై బైఠాయించారు. ఈ ఘటనతో వాహనాలు నిలిచిపోయాయి. విద్యుత్ సరిగా లేక పంటలు ఎండిపోతున్నాయని ప్రజా ప్రతినిధులు కూడా పట్టించుకోవడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Most Read :
- ప్రియుడిని బెయిల్ పై విడిపించేందుకు డ్రగ్ సరఫరా చేస్తూ దొరికిన ప్రియురాలు..!
- బ్లూ డ్రమ్ హత్య కేసులో సంచలన తీర్పు.. ఇద్దరు నిందితులకు మరణశిక్ష..!
- నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం.. భర్త పెద్ద ఖర్మ రోజే భార్య మృతి..!
- Breaking News : బావిలో పడి ఇద్దరు యువకులు మృతి, పంజాబ్ లో కాల్పుల కలకలం, ఒకే క్లిక్ లో ఎన్నో బ్రేకింగ్ న్యూస్..!









