Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం.. భర్త పెద్ద ఖర్మ రోజే భార్య మృతి..!
నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భర్త పెద్ద కర్మ రోజే భార్య మృతి చెంది ఆ కుటుంబంలో విషాదం నింపింది.

నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం.. భర్త పెద్ద ఖర్మ రోజే భార్య మృతి..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భర్త పెద్ద కర్మ రోజే భార్య మృతి చెంది ఆ కుటుంబంలో విషాదం నింపింది. ఈ ఘటన నల్గొండ జిల్లా చండూరు మండలంలో చోటుచేసుకుంది. చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన మోగుదాల పెంటయ్య ఇటీవల మృతి చెందారు. కాగా గురువారం ఆయన పెద్దకర్మ నిర్వహించాల్సి ఉంది. అయితే పెద్దకర్మ నిర్వహించే రోజే అతని భార్య మోగుదాల సాలమ్మ కూడా కన్నుమూశారు. దాంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. మరణంలో కూడా ఆ దంపతులు బంధాన్ని వీడలేదని గ్రామస్తులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.









