ప్రియుడిని బెయిల్ పై విడిపించేందుకు డ్రగ్ సరఫరా చేస్తూ దొరికిన ప్రియురాలు..!
ప్రియుడిని బెయిల్ పై విడిపించేందుకు ఓ ప్రియురాలు డ్రగ్ సరఫరా చేస్తూ పోలీసులకు దొరికింది.

ప్రియుడిని బెయిల్ పై విడిపించేందుకు డ్రగ్ సరఫరా చేస్తూ దొరికిన ప్రియురాలు..!
మన సాక్షి వెబ్ డెస్క్ :
ప్రియుడిని బెయిల్ పై విడిపించేందుకు ఓ ప్రియురాలు డ్రగ్ సరఫరా చేస్తూ పోలీసులకు దొరికింది. విజయవాడ పటమట కు చెందిన నాగ సౌమ్య ఆమె ప్రియుడు కాశివర్ధన్ ఇద్దరు కూడా డ్రగ్స్ కు బానిసలే. అయితే మూడు నెలల క్రితం చిత్తూరులో డ్రగ్స్ సరఫరా చేస్తూ కాశి వర్ధన్ పోలీసులకు దొరికాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.
కాగా అతనిని విడిపించేందుకు ఆమె వద్ద డబ్బులు లేకపోవడంతో కొందరితో కలిసి డ్రగ్ సరఫరా చేస్తూ కమిషన్ డబ్బులు కూడ పెడుతుంది. ఈ క్రమంలోనే కృష్ణలంకకు చెందిన బషీర్ 50 వేల రూపాయలు కమిషన్ ఇస్తానని బెంగళూరుకు వెళ్లి 110 గ్రాముల ఎండిఎంఏ తీసుకుంది. బెంగుళూరు టు హౌరా ఎక్స్ప్రెస్ లో నాగ సౌమ్య తిరిగి విజయవాడకు వచ్చింది. ముందస్తు సమాచారంతో పోలీసులు ఆమెను పట్టుకున్నారు. కాగా పరారీలో ఉన్న బషీర్ ను కూడా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు.









