Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండసంక్షేమం

Miryalaguda : మిర్యాలగూడలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

Miryalaguda : మిర్యాలగూడలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..!

మన సాక్షి, మిర్యాలగూడ :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ పట్టణానికి చెందిన 150 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.1,50,17,400 విలువైన చెక్కులను అందజేశారు.

Also Read : ప్రియుడిని బెయిల్ పై విడిపించేందుకు డ్రగ్ సరఫరా చేస్తూ దొరికిన ప్రియురాలు..!

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలుస్తూ, ఆడబిడ్డల వివాహాల సమయంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, కౌన్సిలర్లు, ఇంచార్జులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు