Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

చిక్కిన ఘరానా దొంగలు.. భారీగా బంగారం స్వాధీనం..!

అన్నమయ్య, కడప జిల్లాల్లో 9 చోరీలకు పాల్పడిన ఇద్దరు ఘరానా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి 185 గ్రాముల బంగారం, 450 గ్రాముల వెండి, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వెల్లడించారు.

చిక్కిన ఘరానా దొంగలు.. భారీగా బంగారం స్వాధీనం..!

వేణుగోపాల్ రాజు – మదనపల్లె,  మనసాక్షి:

అన్నమయ్య, కడప జిల్లాల్లో 9 చోరీలకు పాల్పడిన ఇద్దరు ఘరానా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి 185 గ్రాముల బంగారం, 450 గ్రాముల వెండి, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వెల్లడించారు. మదనపల్లెలో బుదవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిందితులు ఇరగ అశోక్, గువ్వ ఆనంద్ బాబులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

అడిషనల్ ఎస్పీ ఎం. వెంకటాద్రి పర్యవేక్షణలో సీసీఎస్ సీఐ కె. రాజారెడ్డి, ఎస్ఐలు నరసింహుడు, రమేష్, హరిహర ప్రసాద్, రహిముల్లా నిందితులను పట్టుకున్నారని, వారిని అభినందిస్తూ నగదు రివార్డులు అందజేశామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మదనపల్లె డీఎస్పీ బి. ప్రసాద్ పాల్గొన్నారు. ప్రజలు ఊరెళ్లేటప్పుడు విలువైన వస్తువులు ఇంట్లో ఉంచరాదని, అనుమానితులు కనిపిస్తే వెంటనే ‘112’ కు సమాచారం ఇవ్వాలని జిల్లా ప్రజలను ఎస్పీ సూచించారు.

మరిన్ని వార్తలు