తుంగతుర్తి మార్కెట్ చైర్మన్ నేనే..!
రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ ఊపొందుకోవడంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏ ఎం సి. చైర్మన్ పదవుల కోసం అధికార పార్టీల నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈనెల 5వ తేదీతో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకవర్గం పదవీకాలం ముగిసింది.

తుంగతుర్తి మార్కెట్ చైర్మన్ నేనే..!
ఆశావాహుల మధ్య ముదిరిన పోటీ
ఎవరిని వరించనుందో… ఆ కుర్చీ
టాప్ గేర్ లో మార్కెట్ కమిటీ చైర్మన్ లాబీయింగ్…
(సుభాష్ – తుంగతుర్తి)
రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ ఊపొందుకోవడంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏ ఎం సి. చైర్మన్ పదవుల కోసం అధికార పార్టీల నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈనెల 5వ తేదీతో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకవర్గం పదవీకాలం ముగిసింది. దీంతో మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని నియమించాల్సి ఉంది. గ్రామీణ రాజకీయాల్లో నియోజకవర్గాల్లో, పట్టు సాధించడానికి మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్చీ అత్యంత కీలకం కావడంతో ఈ పదవులను దక్కించుకోవడానికి ద్వితీయ శ్రేణి నాయకులు, సీనియర్ కార్యకర్తలు భారీగా పోటీపడుతున్నారు.
కుర్చీ కోసం లాబింగ్ నేతల ప్రదక్షిణలు
మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్చీలను దక్కించుకునేందుకు ఆశావాలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే ఇళ్ళ చుట్టూ నేతల ప్రదక్షణలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో పార్టీ విజయం కోసం కష్టపడిన, తమకే ఈ పదవి దక్కాలని కొందరు డిమాండ్ చేస్తుంటే మరికొందరు సామాజిక సమీకరణాలు కులాల, బల బలాల ఆధారంగా సీటు కేటాయించాలని మరికొందరు అధిష్టానం పై ఒత్తిడి తెస్తున్నారు.
ఎమ్మెల్యే, మంత్రులకు తలనొప్పిగా మారిన సయోధ్య
ఒక్కో మార్కెట్ కమిటీ పరిధిలో చైర్మన్ రేసులో నలుగురు ఐదుగురు గట్టి అభ్యర్థులు ఉండటంతో ఎవరిని ఎంపిక చేయాలో తెలియక స్థానిక ఎమ్మెల్యే తీవ్ర తర్జన బజన పడుతున్నారు. ఒకరికి పదవి ఇస్తే మరొకరు ఎక్కడ అసంతృప్తి లోన అవుతారని భయం నేతల్లో కనిపిస్తుంది ఉదాహరణకు ఏడాది చొప్పున ఇద్దరి నేతలకు పంచుతామని హామీలతో సహజ కుదిరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి మరోవైపు వర్షాకాలం ముగిసి పంటల కొనుగోలు ప్రారంభమవుతున్న తరుణంలో మార్కెట్ కమిటీలను పూర్తిస్థాయిలో బలోపేతం చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రులు సమీక్షలు నిర్వహిస్తున్నారు
తగ్గేదేలే…. నేనే చైర్మన్…!
ఇదిలా ఉండగా మండల కేంద్రాన్ని చెందిన ఒకరిద్దరు కార్యకర్తలు నేనే తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ అంటూ హల్చల్ చేస్తూ జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు జిల్లాస్థాయి నేత అండదండలు తనకు పుష్కలంగా ఉన్నాయంటూ ప్రచారం చేసుకుంటున్నారు. త్వరలోనే నియోజవర్గంలోని అన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకంపై తుది స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం చివరకు ఏ మార్కెట్ చైర్మన్ ఏ నేతకు, ఈ అదృష్టం దక్కుతుందో మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్చీ లు ఎవరిని వరిస్తుందో చూడాలి పార్టీ కోసం అంకితభావంతో పని చేసే వారికి కట్టబెట్టాలని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు









