Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
Nalgonda : రైలు నుంచి జారి కింద పడిన ప్రయాణికుడు..!
నల్గొండ పట్టణంలోని పెద్ద బండ సమీపంలో గల రైల్వే ట్రాక్ ప్రాంతంలో ప్రమాదవశాత్తు రైలులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుడు రైలు నుంచి జారి కింద పడిపోవడం జరిగింది.

Nalgonda : రైలు నుంచి జారి కింద పడిన ప్రయాణికుడు..!
తక్షణమే స్పందించిన నల్గొండ 108 అంబులెన్స్ సిబ్బంది
నల్గొండ, మన సాక్షి :
నల్గొండ పట్టణంలోని పెద్ద బండ సమీపంలో గల రైల్వే ట్రాక్ ప్రాంతంలో ప్రమాదవశాత్తు రైలులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుడు రైలు నుంచి జారి కింద పడిపోవడం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణికుడి యొక్క ఎడమ కాలు పూర్తిగా రెండు భాగాలుగా కట్ అయింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే 108కి సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న నల్గొండ పట్టణ 108 అంబులెన్స్ సిబ్బంది కిరణ్, వెంకటయ్య హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని ఘటన స్థలంలోని ప్రయాణికుడికి ప్రధమ చికిత్స అందించి మెరుగని చికిత్స కోసం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.









