తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ కార్యాలయం ముందు వాహనాలకు నిప్పు..!
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల వల్ల ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఎంపీ మిధున్ రెడ్డి కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే.

తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ కార్యాలయం ముందు వాహనాలకు నిప్పు..!
(మన సాక్షి, మదనపల్లె – రాజు)
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల వల్ల ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఎంపీ మిధున్ రెడ్డి కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మరోచోట రాయచోటి లో కూడా వైసిపి కార్యాలయం ముందు ఉన్న వాహనాలకు దుండగులు నిప్పి పెట్టారు. దాంతో రాయచోటిలో తీవ్ర ఉధృతత చోటుచేసుకుంది. ఈ మంటల్లో కారు, బైక్ పూర్తిగా కాలిపోయాయి.
Also Read : ఏపీలో హై టెన్షన్.. ఎంపీ నిధున్ రెడ్డి కాన్వాయ్ పై రాళ్ల దాడి..!
వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించిన కొద్దిసేపటికి ఈ ఘటన జరిగినట్లుగా కార్యకర్తలు పేర్కొంటున్నారు. శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ దమ్ముంటే తనని ఎదుర్కోవాలని చెప్పిన కొద్దిసేపటికే . ఈ ఘటన జరగింది. అయితే ఈ ఘటనపై వైసీపీ నాయకుల నుండి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. టిడిపి కార్యకర్తలే ఈ ఘటనకు పాల్పడ్డారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.









