Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమహబూబ్‌నగర్విద్య

రెండేళ్ల ప్రగతి ప్రస్థానం.. పాలమూరు వీసీకి ఒప్పంద అధ్యాపక సంఘం ఘన సత్కారం

పాలమూరు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్ రెండేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఒప్పంద అధ్యాపక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఆయనను ఘనంగా సత్కరించారు.

రెండేళ్ల ప్రగతి ప్రస్థానం.. పాలమూరు వీసీకి ఒప్పంద అధ్యాపక సంఘం ఘన సత్కారం

(మహబూబ్‌నగర్ టౌన్ – శ్రీశైలం) మన సాక్షి:

పాలమూరు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్ రెండేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఒప్పంద అధ్యాపక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఆయనను ఘనంగా సత్కరించారు. విశ్వవిద్యాలయ పరిపాలన భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొని వీసీకి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం మరింత అభివృద్ధి సాధించాలని, విద్యా ప్రమాణాలు మెరుగుపడాలని, పరిశోధనలకు ప్రోత్సాహం లభించాలని, మౌలిక సదుపాయాలు విస్తరించాలని, విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆకాంక్షించారు.

Also Read : సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు.. ఎల్ నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ ప్రణాళికలు..!

ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ పి. రమేష్ బాబు, అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ చంద్రకిరణ్, డా. భూమయ్య, డా. రవికుమార్, డా. శ్రీధర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, డా. పర్వతాలు, డా. ఈశ్వర్ కుమార్, డా. గాలెన్న, డా. ప్రభాకర్ రెడ్డి, డా. కరుణాకర్ రెడ్డి, డా. వెంకటేష్, డా. నాగరాజు, డా. జంగం విశ్వనాథ్, సురేష్, డా. సోమేశ్వర్, డా. ఆంజనేయులు, డా. మధు, డా. స్వాతి, డా. సుజాత, డా. సుస్మిత, పీడీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు