Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం.. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..!

శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు కలకలం రేపింది. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దాంతో ఒక్కసారిగా విమానాశ్రయం ఉలిక్కి పడింది.

శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం.. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు కలకలం రేపింది. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దాంతో ఒక్కసారిగా విమానాశ్రయం ఉలిక్కి పడింది. అహ్మదాబాద్ నుంచి శంషాబాద్ కు వస్తున్న ఇండిగో ఎయిర్లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.

Also Read : ఆంధ్రప్రదేశ్ లోని పెనుగొండలో తీవ్ర విషాదం.. రిజర్వాయర్ లో పడి ఐదుగురు బాలికలు మృతి.!

అప్రమత్తమైన సిఐఎస్ఎఫ్ (CISF) బలగాలు ఎయిర్ పోర్టు సెక్యూరిటీ సిబ్బంది రంగంలోకి దిగారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో అభిమానం ల్యాండ్ అయిన వెంటనే భద్రతా ప్రోటోకాల్స్ ప్రకారం సురక్షిత ప్రాంతమైన ఐసోలేషన్ బె కు తరలించారు. వెంటనే బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బందితో విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు