Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లాపండుగలు

Narayanpet : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా ఆయుధ, వాహన పూజ..!

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నారాయణపేట జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఆర్ముడ్ రిజర్వ్ విభాగంలో ఆయుధ పూజ, వాహన పూజలను ఘనంగా నిర్వహించారు.

Narayanpet : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా ఆయుధ, వాహన పూజ..!

నారాయణపేటపట్టణం, మనసాక్షి:-

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నారాయణపేట జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఆర్ముడ్ రిజర్వ్ విభాగంలో ఆయుధ పూజ, వాహన పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ప్రీతి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి, జిల్లా ప్రజలందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని ఆర్ముడ్ రిజర్వ్ విభాగంలో ఆయుధ పూజ నిర్వహించి, విధి నిర్వహణలో కీలక పాత్ర పోషించే ఆయుధాలకు సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. శక్తికి, ధైర్యానికి, విజయానికి ప్రతీకగా నిలిచే దుర్గామాతను ప్రార్థిస్తూ, పోలీస్ సిబ్బంది ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో మరింత అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.

అదేవిధంగా పరేడ్ గ్రౌండ్ లో వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, అత్యవసర సమయాల్లో సత్వర సేవలు అందించడంలో పోలీస్ వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. నేపథ్యంలో ఎస్పీ మాట్లాడుతూ

విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండుగ అని పేర్కొన్నారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు విద్య, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ తదితర అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ విజయపథంలో ముందుకు సాగాలని కోరుకున్నారు.

ప్రజలందరూ పరస్పర ప్రేమాభిమానాలతో, సోదరభావంతో దసరా పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని పిలుపునిచ్చారు. విజయదశమి పండుగ పోలీస్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు కూడా సుఖసంతోషాలు, ఆరోగ్యం, విజయాలను అందించాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. ప్రజల సహకారంతో జిల్లాలో శాంతిభద్రతలను మరింత పటిష్టంగా కొనసాగిస్తూ, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, ఆర్ ఐ విజయ్ భాస్కర్, ఎస్సై లు వెంకటేశ్వర్లు, సునీత, శివ శంకర్, శిరీష, కృష్ణ చైతన్య, ఆర్ముడు రిజర్వ్ పోలీసులు, సిబ్బంది తది తరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు