Miryalaguda : మిర్యాలగూడలో ఘనంగా దసరా ఉత్సవాలు.. పాల్గొన్న ప్రముఖులు..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి స్థానిక ఎన్ఎస్పి క్యాంపు గ్రౌండ్లో నిర్వహించిన దసరా ఉత్సవాలలో పట్టణ ప్రజలు భారీగా పాల్గొని జమ్మి చెట్టు వద్ద పూజలు నిర్వహించారు.

Miryalaguda : మిర్యాలగూడలో ఘనంగా దసరా ఉత్సవాలు.. పాల్గొన్న ప్రముఖులు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి స్థానిక ఎన్ఎస్పి క్యాంపు గ్రౌండ్లో నిర్వహించిన దసరా ఉత్సవాలలో పట్టణ ప్రజలు భారీగా పాల్గొని జమ్మి చెట్టు వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం రావణ దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఉత్సవాలకు పట్టణంలోని ప్రజలు భారీగా తరలివచ్చారు.
కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వివిధ పార్టీలకు చెందిన నాయకులు అల్గుబెల్లి అమరేందర్ రెడ్డి, సాదినేని శ్రీనివాసరావు, నల్లమోతు సిద్ధార్థ, గాయం ఉపేందర్ రెడ్డి, డబ్బికర్ మల్లేష్, ముదిరెడ్డి నర్సిరెడ్డి, శాగ జలెందర్ రెడ్డి, దేశిడి శేఖర్ రెడ్డి, గోదాల జానకి రామ్ రెడ్డి, మిట్టపల్లి వెంకటేష్, ఉత్సవ కమిటీ సభ్యులు ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, రేపాల పురుషోత్తం రెడ్డి, చిలుకూరు శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.
















