Suryapet : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి.. పోలీస్ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు..!
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని ఎల్.బి. నగర్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మాలధారణలో ఉన్న ఓ మహిళ మృతి చెందగా, పోలీస్ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

Suryapet : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి.. పోలీస్ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు..!
(గరిడేపల్లి – వీరాస్వామి, మన సాక్షి )
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని ఎల్.బి. నగర్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మాలధారణలో ఉన్న ఓ మహిళ మృతి చెందగా, పోలీస్ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
మండలంలోని ఎల్.బి. నగర్‌కు చెందిన కాల సుజాత గ్రామంలో రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో గరిడేపల్లికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ మండవ వెంకన్న విధులకు హాజరయ్యేందుకు వెళ్తూ ప్రమాదవశాత్తు సుజాతను ఢీకొట్టారు.
ఈ ప్రమాదంలో సుజాతకు తీవ్ర గాయాలు కాగా, కానిస్టేబుల్ వెంకన్న కాలు విరగడంతో పాటు శరీరంపై బలమైన గాయాలయ్యాయి.
గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మిర్యాలగూడలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సుజాత మృతి చెందారు. కాగా, సుజాత మృతితో ఎల్.బి. నగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమకు న్యాయం చేయాలని, బాధిత కుటుంబానికి తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నాకు దిగుతున్నట్లు సమాచారం.









