Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఅభివృద్దిజిల్లా వార్తలునాగర్ కర్నూల్ జిల్లా

ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు..!

నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని అన్ని గ్రామాలలో స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను ఊర్కొండ మండలంలోని అన్ని గ్రామాల్లో జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు..!

ఊర్కొండ, మన సాక్షి

నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని అన్ని గ్రామాలలో స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను ఊర్కొండ మండలంలోని అన్ని గ్రామాల్లో జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిమాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

పేదలకు ఆహార భద్రత కల్పించడంతో పాటు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. స్మార్ట్ రేషన్ కార్డులు పేద కుటుంబాలకు మరింత సులభంగా, సమర్థవంతంగా ప్రభుత్వ సేవలు అందించేందుకు ఉపయోగపడతాయి అని అన్నారు.

మరిన్ని వార్తలు