Gold Price : మరోసారి భారీగా తగ్గిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!
పసిడి ప్రియులకు మరోసారి భారీ శుభవార్త అందింది. ఇటీవల కాలంలో ఈ రోజు మరోసారి బంగారం ధర భారీగా తగ్గింది. దాంతో పసిడి ప్రియులు ఆనందంలో ఉన్నారు.

Gold Price : మరోసారి భారీగా తగ్గిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
పసిడి ప్రియులకు మరోసారి భారీ శుభవార్త అందింది. ఇటీవల కాలంలో ఈ రోజు మరోసారి బంగారం ధర భారీగా తగ్గింది. దాంతో పసిడి ప్రియులు ఆనందంలో ఉన్నారు. శ్రావణమాసం శుభకార్యాల సందర్భంగా బంగారం కొనుగోళ్ళు మెరుగుపడ్డాయి. హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు శుక్రవారం ఒక్కరోజే 26,200 తగ్గింది. దాంతో 15 లక్షల 28 వేల 900 వందల రూపాయలుగా ఉంది. 22 క్యారెట్స్ 100 గ్రాముల 24 వేల రూపాయలు తగ్గి 14, 01,500 రూపాయలకు చేరింది.
ఈరోజు తులం ఎంతంటే :
హైదరాబాద్ బంగారం మార్కెట్లో శుక్రవారం తులం 10 గ్రాముల బంగారం ధర ఎంత ఉందంటే.. 24 క్యారెట్స్ గోల్డ్ కు 2620 రూపాయలు తగ్గి 1,52, 890 రూపాయలకు చేరింది. అదే విధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం కు 2400 రూపాయలు తగ్గి 1,40,150 రూపాయలుగా ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న ఈ బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా ఇవే ఉన్నాయి.
Most Read :









