సూర్యాపేట జిల్లాలో.. గుప్త నిధుల కోసం తవ్వకాలు.. 8 మంది అరెస్ట్, ఇద్దరు పరారీ..!
సూర్యాపేట జిల్లా చివ్వెంల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉండ్రుగొండ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పురాతన ఆలయాల పరిసర ప్రాంతాల్లో గుప్త నిధుల కోసం అక్రమంగా తవ్వకాలు చేసిన వారిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు సూర్యాపేట రూరల్ సిఐ జి రాజశేఖర్ తెలిపారు.

సూర్యాపేట జిల్లాలో.. గుప్త నిధుల కోసం తవ్వకాలు.. 8 మంది అరెస్ట్, ఇద్దరు పరారీ..!
చివ్వేంల, మన సాక్షి:
సూర్యాపేట జిల్లా చివ్వెంల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉండ్రుగొండ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పురాతన ఆలయాల పరిసర ప్రాంతాల్లో గుప్త నిధుల కోసం అక్రమంగా తవ్వకాలు చేసిన వారిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు సూర్యాపేట రూరల్ సిఐ జి రాజశేఖర్ తెలిపారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..ఈ నెల 6 వ తేది తెల్లవారుజామున కేషరాజు కుంట కట్ట వద్ద అనుమానాస్పదంగా తవ్వకాలు చేస్తున్నరని గ్రామస్తులు పోలీస్ లకు సమాచారం అందించారని చెప్పారు.
పోలీస్ లు తోవ్వాకలకు పాల్పడిన వ్యక్తులను గుర్తించారు. వారి వద్ద నుంచి గుప్త నిధుల కోసం వాడుతున్న మెటల్ డిటెక్టర్, స్కానర్, లొకేటర్ తదితర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఉండ్రుగొండ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ ఛైర్మన్ చకిలం కృష్ణ కుమార్‌గారి ఫిర్యాదు మేరకు చివ్వెంల ఎస్ ఐ వి . మహేశ్వర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
చివ్వెంల ఎస్ఐ వి.మహేశ్వర్ 08 మంది నిందితులను అదుపులోకి తీసుకుని గురువారం అరెస్ట్ చేశారు.నిందితులు పచ్చిపాల మధు, యల్లాల శ్రీకాంత్, భూతరాజు శివ, నకిరేకంటి గోపి, చర్లపల్లి ప్రణయ్ కుమార్, రాపాని తిరుపయ్య, కడారి సైదులు, భూక్యా తులశ్య లను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారిలో ఉన్నారు.ప్రజలు గుప్త నిధుల పేరుతో జరిగే మోసాలను నమ్మవద్దని, ఇలాంటి కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.









