12 న జాతీయ లోక్ అదాలత్..!
జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలిజిల్లా డి.జానకి, బుధవారం సూచనలు తెలిపారు పరస్పర అంగీకారంతో వివాదాలకు సత్వర పరిష్కారం సెప్టెంబర్ 12వ తేదీ శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకుని, రాజీ పడదగిన కేసులను పరస్పర అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకోవాలని మహబూబ్‌నగర్ ఎస్పీ డి. జానకి, సూచించారు.

12 న జాతీయ లోక్ అదాలత్..!
మహబూబ్‌నగర్ జిల్లా, మన సాక్షి :
జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలిజిల్లా డి.జానకి, బుధవారం సూచనలు తెలిపారు పరస్పర అంగీకారంతో వివాదాలకు సత్వర పరిష్కారం
సెప్టెంబర్ 12వ తేదీ శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకుని, రాజీ పడదగిన కేసులను పరస్పర అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకోవాలని మహబూబ్‌నగర్ ఎస్పీ డి. జానకి, సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
కోర్టుల్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న రాజీ పడదగిన వివాదాలను ఇరుపక్షాలు పరస్పర అవగాహనతో పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ ఒక మంచి అవకాశమని తెలిపారు. దీనివల్ల సమయం, ధనం ఆదా కావడంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గి, ఇరువర్గాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
లోక్ అదాలత్‌లో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి వివాదాలు, కుటుంబ మరియు వైవాహిక వివాదాలు, బ్యాంకు రికవరీ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, విద్యుత్ చౌర్యానికి సంబంధించిన కేసులు, సైబర్ సంబంధిత రాజీ పడదగిన కేసులు తదితర కేసులను చట్టపరమైన నిబంధనల మేరకు పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని ఎస్పీ తెలిపారు.
రాజీ మార్గమే రాజమార్గం” అనే విషయాన్ని ప్రజలు గుర్తించి, న్యాయశాఖ అందిస్తున్న జాతీయ లోక్ అదాలత్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమకు సంబంధించిన రాజీ పడదగిన కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలని జిల్లాలోని పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది రాజీ పడదగిన కేసులను గుర్తించి, సంబంధిత ఇరువర్గాల వారిని సంప్రదించి అవసరమైన అవగాహన, కౌన్సిలింగ్ కల్పిస్తూ లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు.
తమ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవాలనుకునే వారు సంబంధిత పోలీస్ అధికారులు లేదా కోర్టు విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందిని సంప్రదించాలని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాజీ పడదగిన కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకుని ప్రశాంతమైన, స్నేహపూర్వక జీవితాన్ని కొనసాగించాలని ఎస్పీ తెలిపారు.









