Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

సూర్యాపేటలో 30 మంది రౌడీ షీటర్ల బైండోవర్..!

వినాయక చవితి పండుగ సందర్భంగా సూర్యాపేట పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.

సూర్యాపేటలో 30 మంది రౌడీ షీటర్ల బైండోవర్..!

సూర్యాపేట, మన సాక్షి :

వినాయక చవితి పండుగ సందర్భంగా సూర్యాపేట పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్లకు, సమస్యాత్మక వ్యక్తులకు ముందస్తు కౌన్సిలింగ్ నిర్వహించారు. పండుగ వేడుకల సందర్భంగా ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని పట్టణ సీఐ వెంకటయ్య హెచ్చరించారు.

వినాయక మండపాల ఏర్పాటు, ఊరేగింపులు, నిమజ్జన కార్యక్రమాల సమయంలో ఎలాంటి గొడవలు, వివాదాలకు పాల్పడకుండా బాధ్యతా యుతంగా వ్యవహరించాలని సూచించారు. పట్టణంలో పాత నేర చరిత్ర కలిగిన, రౌడీ షీటర్లుగా నమోదైన వ్యక్తులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్న సుమారు 30 మంది వ్యక్తులపై బైండోవర్ చర్యలు తీసుకున్నారు.

పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని, ఎలాంటి అనుమానాస్పద ఘటనలు లేదా గొడవలకు సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని సీఐ వెంకటయ్య కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు అజయ్, సందీప్ రెడ్డి, కనకరత్నం, పోలీసు సిబ్బంది శ్రీరాములు, రామ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు