Nalgonda : నల్గొండ హత్య కేసులో కీలక మలుపు.. అందుకే హత్య..!
నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో నాలుగు రోజుల క్రితం జరిగిన హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. నల్గొండ ఏ ఎస్ పి రమేష్ తెలిపిన వివరాల ప్రకారం..

Nalgonda : నల్గొండ హత్య కేసులో కీలక మలుపు.. అందుకే హత్య..!
మన సాక్షి, నల్గొండ :
నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో నాలుగు రోజుల క్రితం జరిగిన హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. నల్గొండ ఏ ఎస్ పి రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ పట్టణం గొల్లగూడ కు చెందిన బోధ్ సాయి (27) గ్రామ దేవతల పండుగల్లో ఆడవేషం ధరించి కొలుపులు చెప్పే వ్యక్తిగా స్థానికంగా గుర్తింపు పొందాడు.
కాగా ఉత్తరప్రదేశ్ కు చెందిన పూర్ఖాన్ అలియాస్ మహేష్ బొట్టుగూడ లో నివాసం ఉంటూ చీరల వ్యాపారం సాగిస్తున్నాడు. సాయికుమార్ తో అతనికి పరిచయం ఏర్పడింది. అప్పుడప్పుడు ఇద్దరు కలిసి మద్యం తాగేవారు. కాగా పూర్ఖన్ తన వ్యాపార అవసరాల కోసం అప్పుగా 30 వేల రూపాయలు ఇవ్వాలని సాయిని కోరాడు. కానీ అందుకు అప్పు ఇవ్వడానికి సాయి నిరాకరించాడు.
సాయి వద్ద ఉన్న బంగారు వెండి ఆభరణాలపై పూర్ఖన్ కన్నేశాడు. అతన్ని హత్య చేసి దోచుకోవాలని ముందస్తుగా పధకం వేశాడు. పూర్ఖన్ ఈనెల 8వ తేదీన తన సహచరుడు ఆరిఫ్ తో కలిసి సాయిని మద్యం పార్టీ పేరుతో తిప్పర్తి మండలం కేశరాజు పల్లి శివారులోని నిర్మానుష ప్రాంతానికి తీసుకొని వెళ్ళాడు. ముందుగా చేసుకున్న పథకం ప్రకారం సిమెంట్ రాయితో సాయిపై దాడి చేసి హత్య చేశాడు.
అప్పు ఇవ్వక పోవడంతో పాటు అతని వద్ద ఉన్న బంగారు, వెండి ఆభరణాలు దోచుకోవచ్చని పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.









