విజయం అంటే ఇదీ.. పేద టైలర్ కుమారుడికి రూ.1.06 కోట్ల ప్యాకేజీ..!
ఓ పేద టైలర్ కుమారుడికి 1.06 కోట్ల వార్షిక వేతనంతో కెనడా కంపెనీలో ఏఐ ఇంజనీర్ గా ఉద్యోగం లభించింది. అతడి తండ్రి ఓ టైలర్.. తల్లి కుట్టు పనిలో భర్తకు సహాయంగా ఉంటుంది. ఇలాంటి పేద కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థి ఊహించలేని విజయం సాధించాడు.

విజయం అంటే ఇదీ.. పేద టైలర్ కుమారుడికి రూ.1.06 కోట్ల ప్యాకేజీ..!
మన సాక్షి, వెబ్ డేస్క్ :
ఓ పేద టైలర్ కుమారుడికి 1.06 కోట్ల వార్షిక వేతనంతో కెనడా కంపెనీలో ఏఐ ఇంజనీర్ గా ఉద్యోగం లభించింది. అతడి తండ్రి ఓ టైలర్.. తల్లి కుట్టు పనిలో భర్తకు సహాయంగా ఉంటుంది. ఇలాంటి పేద కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థి ఊహించలేని విజయం సాధించాడు.
వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం లోని కొత్తపల్లి మండలం కుతుకూడుమిల్లి గ్రామానికి చెందిన మాల్తీ అఖిలేష్ ఇటీవల నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్ లో అతడు ఎంపికై రూ. 1.05 కోట్ల వార్షిక వేతనంతో ఆఫర్ లెటర్ అందుకున్నాడు. ఇటీవలనే విధుల్లో చేరిన అఖిలేష్ ఈ ఉద్యోగం పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగమని చెప్పుకున్నాడు.
మాల్తీ అఖిలేష్ తండ్రి గంగాధరరావు చెవిటి, మూగ.. ఆయన టైలరింగ్ పనిచేస్తూ కొద్దిపాటి ఆదాయంతో ఇద్దరు పిల్లల్ని చదివించాడు. అఖిలేష్ తల్లి భర్త కుట్టిన వస్త్రాలకు చేతి పనులు చేస్తూ ఆసరాగా ఉంటుంది. పేద కుటుంబం నుంచి వచ్చిన అఖిలేష్ భారీ ప్యాకేజీ తో విజయం సాధించాడు. కొత్తపల్లి వివిఎస్ లో పదవ తరగతి వరకు చదివి, నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ లో ఎంపీసీ చదివాడు. సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో డేటా సైన్స్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.