Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణహైదరాబాద్

Ration Cards : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆగస్టు నెల నుంచి స్మార్ట్ కార్డుల ద్వారానే రేషన్ పంపిణీ..!

తెలంగాణ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. నకిలీ రేషన్ కార్డులను అరికట్టడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు గాను రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నది. అందుకుగాను క్యూఆర్ కోడ్ తో పివిసి స్మార్ట్ కార్డులను అందించనున్నది.

Ration Cards : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆగస్టు నెల నుంచి స్మార్ట్ కార్డుల ద్వారానే రేషన్ పంపిణీ..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. నకిలీ రేషన్ కార్డులను అరికట్టడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు గాను రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నది. అందుకుగాను క్యూఆర్ కోడ్ తో పివిసి స్మార్ట్ కార్డులను అందించనున్నది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు మొత్తం ఇప్పటికే పూర్తయ్యాయి. ఆగస్టు మాసంలో స్మార్ట్ రేషన్ కార్డులు ద్వారానే రేషన్ పంపిణీ చేయనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్లకు పైగా కుటుంబాల కోసం క్యూఆర్ కోడ్ తో రూపొందించిన రేషన్ కార్డుల ముద్రణ కూడా పూర్తయింది. ఆయా జిల్లాలకు పంపిణీ కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రేషన్ కార్డుల పంపిణీ చేపట్టేందుకు పౌరసరఫరాల శాఖ సిద్ధంగా ఉంది.

ముందుగా హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంపీల చేతుల మీదుగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పౌరసర పరాల శాఖ అందించనున్నది.

కొత్త రేషన్ కార్డులు స్మార్ట్ కార్డులు క్రెడిట్, డెబిట్ కార్డుల సైజులోనే ఉంటాయి. ఫోటోపై కార్డు యజమాని పేరు చిరునామా ఉంటాయి. స్మార్ట్ కార్డు పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే లబ్ధిదారుల కుటుంబ సభ్యుల వివరాలతో పాటు రేషన్ వస్తువులు తీసుకున్న వివరాలు కూడా ఉంటాయి. స్మార్ట్ కార్డు వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనుసంధానం చేయనున్నారు. అదేవిధంగా రేషన్ కార్డులో ఈ కేవైసీ పూర్తి చేసుకున్న వారి వివరాలు మాత్రమే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ కేవైసీ చేయని వారి వివరాలు స్మార్ట్ కార్డులో వచ్చే అవకాశాలు లేవు.

MOST READ : 

మరిన్ని వార్తలు