District collector : జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్.. ఉదయం 9 గంటలకే అటెండెన్స్ పడాల్సిందే..!
సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇకపై వైద్యులు, సిబ్బంది విధుల్లో క్రమశిక్షణ, రోగులకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

District collector : జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్.. ఉదయం 9 గంటలకే అటెండెన్స్ పడాల్సిందే..!
సూర్యాపేట, మనసాక్షి
సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇకపై వైద్యులు, సిబ్బంది విధుల్లో క్రమశిక్షణ, రోగులకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శనివారం ఆయన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విధులకు ఆలస్యంగా వచ్చినా, డ్యూటీలో నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
9 నుంచి 4 గంటల దాకా అందుబాటులో ఉండాల్సిందే :
ఆసుపత్రి సిబ్బంది పనివేళలపై జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధుల్లో ఉండాలని, 100 శాతం బయోమెట్రిక్ హాజరు ఉండాలని స్పష్టం చేశారు. ఉదయం ఇన్ టైంలో పంచ్ చేయకపోయినా, సాయంత్రం ముందే వెళ్లిపోయినా అడ్మినిస్ట్రేటివ్ చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పాటించాలని, ఐడీ కార్డులు ధరించాలని ఆదేశించారు.
ఓపీలో సీనియర్లు డాక్టర్లు ఉండాలి :
ఓపీ విభాగాల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు క్లినికల్ అవర్స్ లో విధిగా ఉండాలని సూచించారు. జూనియర్ డాక్టర్లపైనే భారం వేయకుండా సీనియర్లు నేరుగా రోగులను పరీక్షించాలని పేర్కొన్నారు.
సీజనల్ వ్యాధులపై స్పెషల్ ఫోకస్
ప్రస్తుతం వర్షాకాలం కావడంతో డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, మెడికల్ వార్డులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతిరోజూ ఫీవర్ కేసులు, అడ్మిషన్లు, డిశ్చార్జ్ వివరాలను అప్డేట్ చేయాలని చెప్పారు. మందుల కొరత లేకుండా బఫర్ స్టాక్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
సీఎస్ఆర్ నిధులతో కొత్త ఎక్విప్మెంట్
ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు, అత్యాధునిక శస్త్రచికిత్సల కోసం లాపరోస్కోపిక్ సెట్స్, అడ్వాన్స్డ్ లాపరోస్కోపీ టవర్స్ కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వీటిని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు లేదా కలెక్టరేట్ గ్రాంట్ల ద్వారా సమకూర్చుకోనున్నట్లు వెల్లడించారు.
కార్యక్రమంలో డాక్టర్లు జనార్ధన్, అనిత, ఉపేందర్, యశ్వంత్, గీత, సంధ్య, వినయ్, తదితరులు పాల్గొన్నారు.










