Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయం

Cotton : పత్తిలో రసం పీల్చే పురుగులకు చెక్.. సింపుల్ చిట్కా, వ్యవసాయ అధికారి సూచన..!

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని నాగూర్ (కే) గ్రామ శివారులో సోమవారం వ్యవసాయ విస్తీర్ణధికారి సంతోష్ పత్తి పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Cotton : పత్తిలో రసం పీల్చే పురుగులకు చెక్.. సింపుల్ చిట్కా, వ్యవసాయ అధికారి సూచన..!

కంగ్టి, మన sals

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని నాగూర్ (కే) గ్రామ శివారులో సోమవారం వ్యవసాయ విస్తీర్ణధికారి సంతోష్ పత్తి పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పొలాల్లో రసం పీల్చే పురుగులు, ప్రత్యేకించి దోమ ఉధృతిని గమనించిన అధికారులు, రైతులకు దాని నివారణా చర్యలపై కీలక సూచనలు చేశారు.

పంట రక్షణకు ప్రతి రైతు తప్పనిసరిగా పసుపు, నీలం జిగురు అట్టలను వినియోగించాలని అధికారులు స్పష్టం చేశారు. రైతులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ప్రాక్టికల్ ఉదాహరణలతో జిగురు అట్టల ప్రాముఖ్యతను వివరించారు. పురుగుల మందుల పిచికారీ ఖర్చు తగ్గించుకోవడమే కాకుండా, ప్రారంభ దశలోనే దోమ ఉధృతిని అరికట్టడానికి జిగురు అట్టలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.

యూరియా వాడకం తగ్గించాలి
అదేవిధంగా, పొలాల్లో యూరియా (నత్రజని) ఎరువులను పరిమితికి మించి వాడటం వల్ల మొక్కలు అతిగా పెరిగి, దోమ మరియు ఇతర రసం పీల్చే పురుగుల ఉధృతి తీవ్రమవుతుందని హెచ్చరించారు. అనవసరమైన యూరియా వాడకాన్ని తగ్గించాలి అని సూచించారు.ఈ కార్యక్రమంలో రైతులు ఉన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు