Alumni : 43 వసంతాలకు అపూర్వ కలయిక..!
వారంతా 43 ఏళ్ల క్రితం ఒకే స్కూల్లో 10వ తరగతి చదువుకున్న చిన్ననాటి స్నేహితులు. ఆత్మీయ సమ్మేళనం పేరిట ఆదివారం ఒకే వేదికపై కలిశారు. తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

Alumni : 43 వసంతాలకు అపూర్వ కలయిక..!
శాలిగౌరారం, మనసాక్షి :
వారంతా 43 ఏళ్ల క్రితం ఒకే స్కూల్లో 10వ తరగతి చదువుకున్న చిన్ననాటి స్నేహితులు. ఆత్మీయ సమ్మేళనం పేరిట ఆదివారం ఒకే వేదికపై కలిశారు. తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. శాలిగౌరారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1982-83 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు శాలిగౌరారం లోని ఒక ఫంక్షన్ హాల్లో 43 వసంతాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్నారు.
ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చిన్ననాటి మధుర స్మృతులను జ్ఞప్తికి తెచ్చుకొని ఆనందపడ్డారు. చిన్ననాటి స్నేహం, ఆప్యాయత, అనుబంధాలకు ప్రతీకగా నిలిచింది.ఈ సమ్మేళనం లో వారు కలుసుకోవడం తో పాత స్నేహ బంధాలు మరింత బలపడ్డాయి.
అప్పట్లో తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులైన పూర్వ ప్రధానోపాధ్యాయులు గుండా వరదయ్య, బయాలాజీ ఉపాధ్యాయులు మహ్మద్ షబ్బీర్ అలీ గుర్తుచేసుకుని ఆనందంగా గడిపి వారిని ఘనంగా సన్మానించారు. విద్యార్ధి దశలో క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యను బోధించారని అభిప్రాయ పడ్డారు.
ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు చిల్లంశెట్టి గణేష్,టేకుల సులోధర్, బండారు వేణు, బండారు రామస్వామి, గుండ్ల సోములు, మారోజు వెంకటాచారి, పాల్వాయి హరివర్ధన్ రెడ్డి, మిర్యాల గణేష్, కొడవటికంటి సుబ్రమణ్య శర్మ, బండారు శ్రీనివాస్,పాదూరి శ్రీదేవి, పాదూరి పుష్పా, శకుంతల, సుమలత, సుమతి, హేమలత, శశికళ తదితరులు పాల్గొన్నారు.









