Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

District Sp : జిల్లా ఎస్పీ కీలక సూచన.. అవకాశాలను విజయాలుగా మలచుకోవాలి..!

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది ప్రతి ఒక్కరి కల అని, అందులోనూ సమాజ భద్రతలో భాగస్వామ్యమయ్యే పోలీస్ ఉద్యోగం అత్యంత బాధ్యతా యుతమైనదని, సమాజానికి సేవ చేయడానికి పోలీసు ఉద్యోగం మంచి వారధి అని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు.

District Sp : జిల్లా ఎస్పీ కీలక సూచన.. అవకాశాలను విజయాలుగా మలచుకోవాలి..!

సూర్యాపేట, మనసాక్షి

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది ప్రతి ఒక్కరి కల అని, అందులోనూ సమాజ భద్రతలో భాగస్వామ్యమయ్యే పోలీస్ ఉద్యోగం అత్యంత బాధ్యతా యుతమైనదని, సమాజానికి సేవ చేయడానికి పోలీసు ఉద్యోగం మంచి వారధి అని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. ప్రభుత్వం పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిందని, త్వరలోనే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుందని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఉద్యోగాలకు సిద్ధమయ్యే నిరుద్యోగ యువతీ యువకులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. సమగ్రమైన అవగాహన, పక్కా ప్రణాళికతో సాధన చేస్తే ప్రభుత్వ ఉద్యోగం సులువుగా సాధించవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకుని, లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అవకాశాలను విజాయాలుగా మలచుకోవాలి అన్నారు.

అర్హులైన అభ్యర్థుల కోసం జిల్లా యంత్రాంగం సహకారంతో, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే ముందస్తు ఉచిత శిక్షణ అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
నిరుద్యోగ యువత సమయాన్ని వృథా చేయకుండా ఉద్యోగ సాధనకు సిద్ధం కావాలని, ప్రామాణికమైన పుస్తకాలను ఎంచుకోవాలని ఎస్పీ సూచించారు. సబ్జెక్టుపై పట్టు సాధించేందుకు అవసరమైన వారు శిక్షణ తీసుకోవాలని కోరారు.

పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న యువతీ యువకులకు సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ తరపున ఆయన ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తాం అని ఎవరైనా చెపితే ఎలాంటి వారి మాటలు నమ్మి ఎవ్వరికీ డబ్బులు ఇవ్వవద్దని కోరారు.

మరిన్ని వార్తలు