చెరకు టన్నుకు రూ.4,500 మద్దతు ధర కల్పించాలి.. కమిషనర్ ను కలిసిన ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నియోజకవర్గంలోని చెరకు రైతుల సమస్యలను పరిష్కరించి, వారికి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, మాజి డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ లు బుధవారం హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర చెరకు శాఖ కమిషనర్ని కలిశారు.

చెరకు టన్నుకు రూ.4,500 మద్దతు ధర కల్పించాలి.. కమిషనర్ ను కలిసిన ఎమ్మెల్యే మాణిక్ రావు
( జహీరాబాద్ – సంగారెడ్డి )
జహీరాబాద్ నియోజకవర్గంలోని చెరకు రైతుల సమస్యలను పరిష్కరించి, వారికి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, మాజి డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ లు బుధవారం హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర చెరకు శాఖ కమిషనర్ని కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే , చైర్మన్లు మాట్లాడుతూ.. జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో సుమారు 49,592 ఎకరాల్లో చెరకు సాగు జరుగుతుండగా, ఏటా 12,39,800 మెట్రిక్ టన్నుల చెరకు ఉత్పత్తి అవుతోందని తెలిపారు.
గత మూడు సంవత్సరాలుగా స్థానిక చక్కెర కర్మాగారం మూతపడటంతో చెరకు రైతులు తమ పంటను కోత కోసి విక్రయించుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. చెరకు పంటకు టన్నుకు రూ.4,500 చొప్పున ధర నిర్ణయించి రైతులకు న్యాయం చేయాలని రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.









