సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల లో ఘోర ప్రమాదం.. భర్త కళ్ళ ఎదుటే భార్య మృతి..!
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భర్త కళ్ల ఎదుటే భార్య మృతి చెందింది. ఈ ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల లో ఘోర ప్రమాదం.. భర్త కళ్ళ ఎదుటే భార్య మృతి..!
మన సాక్షి సూర్యాపేట :
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భర్త కళ్ల ఎదుటే భార్య మృతి చెందింది. ఈ ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా పల్లిగూడెం గ్రామానికి చెందిన గురువమ్మ (40) ఆమె భర్త వెంకన్నతో కలిసి మిర్యాలగూడ నుంచి హుజూర్నగర్ కు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు.
Also Read : వామ్మో మామూలు స్కెచ్ కాదు.. ఉద్యోగం, జీతం, సర్టిఫికెట్లు అన్ని ఫేక్.. లోన్ మాత్రం 30 లక్షలు..!
ఈ దంపతులు చిలక జ్యోతిష్యం చెబుతూ జీవనం సాగిస్తున్నారు. కాగా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో చౌరస్తా వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ వారి బైకును ఢీకొట్టింది. దాంతో గురువమ్మ రోడ్డుపై పడిపోగా తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాద సమయంలో అటుగా వెళుతున్న ఆర్టీసీ బస్సు టైర్ల కిందకు ద్విచక్ర వాహనం వెళ్ళింది.
Also Read : అమెరికాలో నల్గొండ యువతి అదృశ్యం.. ఫోన్లో పరామర్శించిన కేటీఆర్..!
ప్రమాదం అనంతరం టిప్పర్ డ్రైవర్ పరారైనట్లు సమాచారం. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య మృతితో భర్త విలపిస్తున్న దృశ్యం పలువురిని కంటనీరు పెట్టించింది. భర్త వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నేరేడుచర్ల ఎస్సై గోపాల్ రెడ్డి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.









