Viral : గోమాతకు సీమంతం.. ఊరంతా విందు భోజనం.. సోషల్ మీడియాలో వైరల్..!
మూగజీవాలను కేవలం జంతువులు గా మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులుగా భావించేవారు చాలామంది ఉంటారు. మూగజీవాలు తమ కుటుంబంలో సభ్యులుగా భావించి పండుగలు, పబ్బల సమయంలో కూడా వివిధ రకాల కార్యక్రమాలు చేస్తుంటారు.

Viral : గోమాతకు సీమంతం.. ఊరంతా విందు భోజనం.. సోషల్ మీడియాలో వైరల్..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
మూగజీవాలను కేవలం జంతువులు గా మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులుగా భావించేవారు చాలామంది ఉంటారు. మూగజీవాలు తమ కుటుంబంలో సభ్యులుగా భావించి పండుగలు, పబ్బల సమయంలో కూడా వివిధ రకాల కార్యక్రమాలు చేస్తుంటారు. గోమాతను కుటుంబ సభ్యులుగా భావించి గర్భిణీతో ఉన్న గోమాతకు ఒక దంపతులు సీమంతం చేశారు. ఈ వేడుకలో ఊరంతా విందు భోజనం పెట్టారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : Viral : రైతు సాహసం.. మొసలిని భుజంపై మోస్తూ పోలీస్ స్టేషన్ కు.. వీడియో వైరల్..!
మధ్యప్రదేశ్ లోని బురన్ పూర్ జిల్లాలో బోర్ సన్ గ్రామానికి చెందిన రైతు హరిబావు చౌదరి ఆయన భార్య బేబా బాయి చౌదరి తమ కుటుంబంలో గోవును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఇంట్లోని గోవు గర్భం దాల్చడంతో మానవులకు నిర్వహించినట్లుగానే సాంప్రదాయబద్ధంగా సీమంతం వేడుక నిర్ణయించుకున్నారు.
Also Read : Viral : కానిస్టేబుల్ ను చితకబాదిన మరో కానిస్టేబుల్..!
ఈ వేడుక కోసం గోవును ప్రత్యేకంగా అలంకరించి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తుల సమక్షంలో శాస్త్రోప్తంగా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. సంప్రదాయ ప్రకారం.. మహిళలు మంగళహారతులు పాడుతూ గోమాతకు సీమంతం జరిపించారు. ఈ వేడుకనంతరం గ్రామంలోని బంధువులు ప్రజలందరికీ కూడా విందు భోజనాలను ఏర్పాటు చేశారు. భారతీయ సాంప్రదాయంలో గోమాతను పూజించడం భక్తికి ప్రతీకనీ, ఈ వేడుక ద్వారా గ్రామాల్లో సౌబ్రాహ్తృత్వం, ఐక్యత చాటుకోవడం అని ఆ రైతు దంపతులు పేర్కొన్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.









