Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్, ఐదుగురు పరార్..!

నారాయణపేట పట్టణంలోని పేరపల్ల రోడ్డులో ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో మంగళవారం పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు దాడి నిర్వహించారు.

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్, ఐదుగురు పరార్..!

( నారాయణపేటపట్టణం – రమాకాంత్ )

నారాయణపేట పట్టణంలోని పేరపల్ల రోడ్డులో ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో మంగళవారం పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకోగా, మరో ఐదుగురు అక్కడి నుంచి పరారయ్యారు.

Also Read : పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్..!

పట్టుబడిన వారి వద్ద నుంచి పేకాటకు సంబంధించిన రూ.5,025 నగదు, 4 సెల్‌ఫోన్లు, 6 ద్విచక్ర వాహనాలను* పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ ఘటనపై టౌన్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పేకాట ఆడుతూ పట్టుబడిన నలుగురిపై గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

పరారైన వారి వివరాలను సేకరించి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
జిల్లాలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, పేకాట, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ సూచించారు.

మరిన్ని వార్తలు