ఇరికుల్లలో విషాదం.. భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య..!
భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ రూరల్ మండలం ఇరికుల్ల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.

ఇరికుల్లలో విషాదం.. భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య..!
( కరీంనగర్ బ్యూరో – నరేష్ )
భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ రూరల్ మండలం ఇరికుల్ల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. రూరల్ పోలీసుల వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన ఇమ్మడి ముత్తయ్య కుమార్తె శ్రావంతి (35)కి 11 ఏళ్ల క్రితం ఇరికుల్ల గ్రామానికి చెందిన కొత్తూరి సంపత్ (42)తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
వివాహ సమయంలో సంపత్‌కు రెండు వాహనాలతో పాటు ఇంటి నిర్మాణం కోసం రూ.8 లక్షల నగదు ఇచ్చినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. గత ఆరు నెలలుగా తన తండ్రి వద్ద ఉన్న ప్లాటును విక్రయించి డబ్బులు ఇవ్వాలని సంపత్ భార్యను వేధిస్తూ, తరచూ గొడవపడుతూ కొట్టేవాడని ఆరోపించారు. ఈ విషయాన్ని శ్రావంతి తన తండ్రికి చెప్పడంతో, ఆయన గ్రామానికి వచ్చి పెద్దమనుషుల సమక్షంలో సంపత్‌కు నచ్చజెప్పినప్పటికీ వేధింపులు ఆగలేదని పేర్కొన్నారు.
Also Read : బియ్యం ధరలపై ప్రభుత్వం సీరియస్.. గరిష్ట పరిమితి విధిస్తూ నిర్ణయం, ఇవీ ఫైనల్ ధరలు..!
ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున ఇంట్లో చీరతో ఉరివేసుకుని శ్రావంతి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న ఆమె తండ్రి ముత్తయ్య ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని కుమార్తె మృతదేహాన్ని పరిశీలించారు. తన కుమార్తె మృతికి భర్త వేధింపులే కారణమంటూ కరీంనగర్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు ఆసుపత్రికి చేరుకుని ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
మృతదేహానికి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడు కొత్తూరి సంపత్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయని కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి తెలిపారు. దర్యాప్తులో వెల్లడయ్యే ఆధారాల మేరకు చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.









