Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

పండుగ వేళ విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య..!

హైదరాబాద్ నగరంలో పండుగ వేళ విషాద ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ నగరంలోని ఐటి కారిడార్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

పండుగ వేళ విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య..!

మన సాక్షి, వెబ్ డెస్క్

హైదరాబాద్ నగరంలో పండుగ వేళ విషాద ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ నగరంలోని ఐటి కారిడార్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ దంపతులు తమ కుమారుడితో కలిసి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు.

గౌలిదొడ్డిలోని జయభేరి నిర్వాణ అపార్ట్మెంట్ సి బ్లాక్ ప్లాట్ నెంబర్ 702లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతులు భక్తుల మా రెడ్డి (65) ఆయన భార్య బత్తుల భారతి (60) కుమారుడు బత్తుల నిశాంత్ రెడ్డి (38) గా పోలీసులు గుర్తించారు. గత ఏడాదికాలంగా ఈ కుటుంబం ప్లాట్ లో నివాసం ఉంటున్నట్లు తెలిసింది.

స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని ప్రభుత్వ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటన ఆర్థిక ఇబ్బందులా.. లేక ఇతర కుటుంబ సమస్యలా.. అనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు.

మరిన్ని వార్తలు