ప్రభుత్వ ఉద్యోగం కోసం నకిలీ డెత్ సర్టిఫికెట్.. నల్గొండ జిల్లాలో గుట్టు రట్టు.. 14 మంది అరెస్ట్..!
ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏకంగా ఓ ఉద్యోగి మరణించిన తేదీనే మార్చేశారు.

ప్రభుత్వ ఉద్యోగం కోసం నకిలీ డెత్ సర్టిఫికెట్.. నల్గొండ జిల్లాలో గుట్టు రట్టు.. 14 మంది అరెస్ట్..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏకంగా ఓ ఉద్యోగి మరణించిన తేదీనే మార్చేశారు. విధుల్లో ఉండగానే మరణించినట్లు నకిలీ రికార్డులు సృష్టించి, ఆయన కుమారుడికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించిన భారీ మోసం నల్లగొండ జిల్లాలో వెలుగుచూసింది. కుటుంబ సభ్యులు, బంధువులు, మున్సిపల్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన కొందరు అధికారులు, సిబ్బంది కుమ్మ క్కై సాగించిన ఈ అక్రమ వ్యవహారాన్ని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మొత్తం 14 మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ వెల్లడించారు.
విధుల్లో ఉండగానే చనిపోయినట్లు రికార్డులు
శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ అసిస్టెంట్‌గా పని చేసిన చామకూరి వెంకటేశ్వర్లు 2025 మే 31న పదవీ విరమణ పొందారు. అనారోగ్యంతో బాధపడుతూ అదే ఏడాది నవంబర్ 17 న మరణించారు. అయితే ఆయన మరణాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు, ఆయన విధుల్లో ఉండగానే 2025 మే 28న మరణించినట్లు తప్పుడు రికార్డులు సృష్టించేందుకు కుట్ర పన్నారు. ఈ తప్పుడు పత్రాలతో కుమారుడు చామకూరి రాజుకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలన్నదే వారి అసలు లక్ష్యంగా పోలీసులు గుర్తించారు.
రూ.13 లక్షలకు బేరం.. ఆధార్ చిరునామా మార్పు
ఈ అక్రమ వ్యవహారంలో మృతుడి భార్య వసంత, కుమారుడు రాజు, బంధువులు, సంబంధిత శాఖల సిబ్బంది కీలక పాత్ర పోషించినట్లు పోలీసుల విచారణ లో వెల్లడైంది. DMHO కార్యాల యంలో పనిచేస్తున్న CC పోలె రంజిత్ కుమార్‌ను సంప్రదించి రూ.13 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ముందుగా మృతుడి ఆధార్ కార్డులో చిరునామాను మార్చి, నల్లగొండ పట్టణంలోని చైతన్యపురి కాలనీలో నివసిస్తున్నట్లు తప్పుడు వివరాలు నమోదు చేశారు. అనంతరం ఈ వివరాల ఆధారంగా మున్సిపాలిటీ నుంచి నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని పొందినట్లు పోలీసులు గుర్తించారు.
Also Read : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. ఏడుగురికి గాయాలు.. మానవత్వంతో స్పందించిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్..!
రెండు శాఖల్లోనూ తప్పుడు పత్రాల వ్యవహారం
నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం తయారీ నుంచి కారుణ్య నియామకం వరకు పలుస్థాయిల్లో అక్రమాలు జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. మున్సిపల్ శాఖలోని వార్డు ఆఫీసర్, శానిటరీ ఇన్స్పెక్టర్, మీ సేవా కేంద్ర నిర్వాహకుడు తదితరులు నిబం ధనలకు విరుద్ధంగా వ్యవహరిం చినట్లు గుర్తించారు. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలోని కొందరు అధికారులు, ఉద్యోగులు తప్పుడు విచారణ నివేదికలు రూపొందించి, సంబంధిత ఫైళ్లను ముం దుకు పంపినట్లు వెల్లడైంది. ఈ పత్రాల ఆధారంగా చామకూరి రాజుకు దామరచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కారుణ్య నియా మకం కింద ఉద్యోగం కల్పించారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా రూ.5 లక్షల నగదు, ఒక కంప్యూటర్, ఒక ప్రింటర్, 12 సె ల్ఫోన్లు, మృతుడు వెంకటేశ్వర్లు ఫొటోను స్వాధీనం చేసుకున్నా రు.
కమిషనర్ ఫిర్యాదుతో గుట్టు రట్టు
నల్లగొండ మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ ఫిర్యాదు మేరకు నవంబర్ 4, 2026న నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ ఆదేశాలతో డీఎస్పీ కె. శివరామిరెడ్డి పర్యవేక్షణలో ప్ర త్యేక బృందాలు దర్యాప్తు చేప ట్టాయి. వన్‌టౌన్ ఇన్చార్జ్ సీఐ కె. ఆది రెడ్డి, రూరల్ ఎస్ఐ బి. శివప్రసాద్, టూటౌన్ ఎస్ఐ డి. సైదాబాబు, వన్‌టౌన్ ఎస్ఐలు ఎన్. వెంకట్ నారాయణ, జె. సైదులు తదితరులు సమన్వయంతో విచారణ జరిపి అక్రమ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు.
పరారీలో ఇద్దరు నిందితులు
ఈ కేసులో మొత్తం 16 మందిని నిందితులుగా గుర్తించగా, వారిలో 14 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్న ట్లు వెల్లడించారు. వారిని పట్టుకు నేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతకు తూట్లు పొడుస్తూ, నకిలీ ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగం పొందేందుకు సాగించిన ఈ కుట్ర ప్రభుత్వ శాఖల్లో కలకలం రేపుతోంది. ఇచ్చిన వివరాల ప్రకారం 16 మందిని నిందితులుగా పేర్కొన గా, 14 మంది అరెస్టయ్యారు. అందులో ఇద్దరు పరారీలో ఉన్నారు.









