వివాహిత మహిళ ఆత్మహత్య
కడుపునొప్పి, అనారోగ్యం ఆ వివాహిత జీవితాన్ని భరించలేని కడుపునొప్పి చివరకు మరణించింది.

వివాహిత మహిళ ఆత్మహత్య
( మహబూబ్ నగర్ జిల్లా – గోపాల్ )
కడుపునొప్పి, అనారోగ్యం ఆ వివాహిత జీవితాన్ని భరించలేని కడుపునొప్పి చివరకు మరణించింది. ఎస్సై నరేందర్, తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని దొడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ రామలింగం భార్య రొయ్యల అరుణ, (26) చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండేది.
అరుణకు 2021లో రామలింగంతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త విధుల నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లిన సమయంలో అరుణ తన పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లి అక్కడే ఉండేది. ఇటీవల భర్త విధుల నుంచి ఇంటికి రావడంతో ఆమె కూడా దొడ్డిపల్లికి చేరుకున్నది.
Also Read : జెసిబి వాహనం ఢీకొని యువకుడు మృతి
ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం భర్త రామలింగం పని నిమిత్తం జడ్చర్లకు వెళ్లగా, అత్త జంగమ్మ ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు కిష్టారం గ్రామానికి వెళ్లింది.ఇంట్లో ఇద్దరు చిన్నారులతో ఉన్న అరుణకు ఒక్కసారిగా తీవ్రమైన కడుపునొప్పి రావడంతో తీవ్ర వేదనకు గురైంది. నొప్పి భరించలేక ఇంట్లోని మరో గదిలోకి వెళ్లి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఇదిలా ఉండగా, కిష్టారంలో శుభకార్యానికి వెళ్లిన అరుణ తల్లి స్వాతి కుమార్తెకు ఫోన్ చేయగా చిన్నారులు ఏడుస్తూ ఫోన్ ఎత్తడంతో అనుమానం వచ్చింది. వెంటనే కిష్టారం గ్రామానికి చెందిన సున్నపు హరీష్‌ను దొడ్డిపల్లిలోని ఇంటికి పంపించింది. ఇంట్లోకి వెళ్లి చూడగా అరుణ ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా విషాదం అలుముకున్నది.
మృతురాలి తల్లి సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.









