Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : మిర్యాలగూడలో ఇసుక ట్రాక్టర్లు పట్టివేత..!
మిర్యాలగూడ మండలంలోని యాదగిరి పల్లి గ్రామ శివారులో ఎస్సై ఉప్పు నగేష్, సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

Miryalaguda : మిర్యాలగూడలో ఇసుక ట్రాక్టర్లు పట్టివేత..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ మండలంలోని యాదగిరి పల్లి గ్రామ శివారులో ఎస్సై ఉప్పు నగేష్, సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా కామేపల్లిగూడెం మూసి నుండి మిర్యాలగూడ వైపు అక్రమంగా, దొంగతనంగా ఇసుకను రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను శనివారం పట్టుకోవడం జరిగింది.
అట్టి ట్రాక్టర్ల డ్రైవర్లు తడకమళ్ళ గ్రామానికి చెందిన చందు, పేరయ్య లపై అట్టి ట్రాక్టర్ యజమానులు కామేపల్లిగూడెం కు చెందిన వారిపైన కూడా కేసు నమోదు చేసి అట్టి ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిగినది.
ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా దొంగతనంగా ఇసుకను రవాణా చేసిన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే అట్టి వ్యక్తులను బైండ్ఓవర్ కూడా చేయడం జరుగిందని ఎస్సై తెలిపారు.








