Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్రాజకీయం

నిసార్ అహమ్మద్ సంచలన ప్రకటన.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల్లో ట్యాంపరింగ్.. కోర్టును ఆశ్రయిస్తాం..!

అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ట్యాంపరింగ్ జరిగిందని, ఫలితాలు తారుమారు చేసి ప్రకటించారని మదనపల్లె వైసీపీ సమన్వయకర్త ఎస్. నిసార్ అహమ్మద్ ఆరోపించారు.

నిసార్ అహమ్మద్ సంచలన ప్రకటన.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల్లో ట్యాంపరింగ్.. కోర్టును ఆశ్రయిస్తాం..!

( మదనపల్లె – వేణుగోపాల్ రాజు )

అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ట్యాంపరింగ్ జరిగిందని, ఫలితాలు తారుమారు చేసి ప్రకటించారని మదనపల్లె వైసీపీ సమన్వయకర్త ఎస్. నిసార్ అహమ్మద్ ఆరోపించారు. ఆదివారం మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి స్వగృహంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

మదనపల్లె నియోజకవర్గంలో ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఆధిక్యత కనబరిచిందని, ఫలితాల ప్రకటనలో కూటమి ప్రభుత్వ పెద్దలు సంబంధిత అధికారులపై వత్తిడి తెచ్చి వాస్తవ విరుద్ధంగా ప్రకటనలు చేశారని మండిపడ్డారు. మదనపల్లె నియోజకవర్గ ఎన్నికల యుద్ధంలో కూటమితో పోరాటం చేసి గెలిచిన వైసీపీ కౌన్సిలర్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

మదనపల్లె నియోజకవర్గంలో మూడు జడ్పీటీసీలు గెలుపు సాధించామని, కానీ రామసముద్రంలో మంత్రి ప్రోద్బలంతో గెలిచిన వ్యక్తిని పక్కన పెట్టి, ఓడిన వ్యక్తిని ప్రకటించారని ఆరోపించారు. సంబంధిత ఎన్నికల అధికారులపై ఖచ్చితంగా కోర్టుకు వెళ్తామని ప్రకటించారు. మదనపల్లె నియోజకవర్గంలో 50 ఎంపీటీసీలకు గాను 21 గెలుపొందామని, ఎక్కువ ఎంపీటీసీలు గెలుపొందిన కొన్నిచోట్ల బలవంతపు ప్రకటనలు చేయించారని ఆరోపించారు.

వాస్తవానికి మదనపల్లె, రామసముద్రం, నిమ్మనపల్లె మండలాల్లో వైసీపీ అత్యధిక ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గెలుపు సాధిస్తే, రామసముద్రంలో కావాలనే మంత్రి, ఎమ్మెల్యేల వత్తిడితో టీడీపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారని అన్నారు.

నామినేషన్లు వేసే నాటి నుంచి గెలుపు ధృవీకరణ పత్రం అందుకునే వరకు కూటమి ప్రభుత్వ వత్తిడి అధికంగా ఉన్నా తట్టుకుని నిలబడిన ప్రతి వైసీపీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో రాబోయే అన్ని ఎన్నికల్లో కలిసికట్టుగా పోరాటం చేసి గెలుపు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు