హైదరాబాద్ నగరంలో కలకలం.. విద్యార్థి ఆత్మహత్య, కళాశాల ఎదుట ఆందోళన..!
హైదరాబాద్ నగరంలో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో నగరంలో కలకలంగా మారింది. విద్యార్థి ఆత్మహత్యతో తోటి విద్యార్థులు ఆగ్రహించి విద్యాసంస్థ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు.

హైదరాబాద్ నగరంలో కలకలం.. విద్యార్థి ఆత్మహత్య, కళాశాల ఎదుట ఆందోళన..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
హైదరాబాద్ నగరంలో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో నగరంలో కలకలంగా మారింది. విద్యార్థి ఆత్మహత్యతో తోటి విద్యార్థులు ఆగ్రహించి విద్యాసంస్థ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నగరంలోని ఎస్సార్ నగర్ పరిధిలో ఉన్న హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
Also Read : కారు రిపేర్ అయింది.. స్మగ్లింగ్ ప్లాన్ రివర్స్ అయింది.. సూర్యాపేటలో హైడ్రామా..!
ప్రిన్సిపల్ నిరంతర వేధింపుల కారణంగానే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని నిరసనకారులు ఆరోపించారు. ఘటనపై నిష్పక్షపాతంగా పోలీసులు విచారణ జరిపించి విద్యార్థి మృతికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. విద్యార్థి ఆత్మహత్యపై గల కారణాలను, ప్రిన్సిపల్ పై వచ్చిన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకుగాను పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.









